జిల్లాను కరువు నుంచి కాపాడాలి
● గణపతి సచ్చిదానంద స్వామీజీ
● 100 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం
రాప్తాడు రూరల్: జిల్లాను కరువు నుంచి కాపాడాలన్నదే దత్తపీఠం లక్ష్యమని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి (జయలక్ష్మీపురం)లో వన మహోత్సవంలో భాగంగా దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద తీర్థ స్వామీజీ కలసి స్వామీజీ మొక్కలు నాటి, మాట్లాడారు. 100 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం దత్త క్రియాయోగ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో మచ్చా రామలింగారెడ్డి, దత్తపీఠం శ్రీనాథ్, స్వామీజీ ట్రస్ట్ సభ్యుడు నారాయణ శర్మ, నాయుడు పాల్గొన్నారు.


