జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు
అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నగదు అపహరణ
కేసులో నిందితుడి అరెస్ట్
నార్పల: నగదు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ సాగర్ వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు, తన భార్యతో కలసి నార్పలలోని స్టేట్‌బ్యాంకులో ఉన్న తన ఖాతా నుంచి రూ.3 లక్షలు డ్రా చేసి ద్విచక్ర వాహనంలోని బ్యాగ్‌లో ఉంచుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో నార్పల సంతలో నిత్యావస సరుకులు తీసుకునేందుకు వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో చిన్నా అనే యువకుడు నగదు అపహరించాడు. ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్న చిన్నాను.. సోమవారం నార్పల క్రాస్ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు


