బుక్కరాయసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 39.4–42.2, రాత్రి ఉష్ణోగ్రతలు 22.6–24.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 60–68 శాతం, మధ్యాహ్నం 18–21 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.


