60 శాతం మందిలో సమస్య
నిద్రలేమిని వైద్య పరిభాషలో ‘స్లీప్ డిప్రెషన్’ అంటాం. దీన్ని చాలామంది గుర్తించడం లేదు. సకాలంలో గుర్తించి డాక్టర్ కౌన్సెలింగ్ తీసుకుంటే నియంత్రించవచ్చు. దీర్ఘకాలంగా ఇలా స్లీప్ డిప్రెషన్‌లో ఉంటే పనిచేసే సామర్థ్యం కోల్పోతారు. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ ఒత్తిళ్లతో స్లీప్ డిప్రెషన్ వస్తుంది. 60 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. మొబైల్‌ను వీలైనంతగా తగ్గించడం మంచిది.
–డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు,
జాతీయ హెల్త్ మిషన్


