తుమ్మపాల: పాఠకులకు నాణ్యమైన విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో విజయవాడకు చెందిన ఎమ్మెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఉచితంగా వివిధ నూతన పుస్తకాలను అందించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వి.సతీష్‌కుమార్‌తో కలిసి పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెస్కో సంస్థ అందించిన పుస్తకాలు విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, పాఠకులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ పుస్తకాలను జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలకు బట్వాడా చేసి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రంథాలయాల వినియోగాన్ని ప్రజలు మరింతగా పెంచుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.


