అపార్ట్‌మెంట్‌పై నుంచి జారిపడి వాచ్‌మన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌పై నుంచి జారిపడి వాచ్‌మన్‌ మృతి

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

పెందుర్తి: చినముషిడివాడలోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వాచ్‌మెన్‌ దుర్మరణం పాలయ్యాడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన వి.సన్నిబాబు(51) కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం చినముషిడివాడ వలస వచ్చారు. ఇక్కడి ఎల్‌ఎం నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరాడు. శుక్రవారం నాలుగో అంతస్తులో పని నిమిత్తం వెళ్లిన సన్నిబాబు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అయితే యజమానులు పనులు చెప్పడంతో పైకి వెళ్లిన సన్నిబాబు ప్రమాదానికి గురయ్యాడని.. కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కాసేపు ఆందోళన చేశారు. స్థానికులు వారికి సర్ది చెప్పడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ ఆద్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement