కూటమి నేతల అరాచకాలను ఎదుర్కొంటాం | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల అరాచకాలను ఎదుర్కొంటాం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

● మాజీ మంత్రి అమర్‌నాథ్‌

నర్సీపట్నం: కూటమి నేతల అరాచకాలను న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని, మరీ శ్రుతిమించితే రోడ్డెక్కి ప్రతిఘటిస్తామని మాజీ మంత్రి గుడి వాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. నర్సీపట్నం పెద్దచెరువు ఘటనలో వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఉపాధ్యక్షుడు సుర్లనాయుడులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ఆయన గురువారం నర్సీపట్నంలో బాధిత కుటుంబాలను కలిసి భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ చెరువులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతుండడంతో పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌పై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనుచరులు దాడికి యత్నించి, కారును ధ్వంసం చేశారన్నారు.సెక్యూరిటీగార్డుతో మాజీ ఎమ్మెల్యే గణేష్‌, పీఏ, పార్టీ నాయకులు శివ, నాయుడుపై అక్రమ కేసు పెట్టించారని చెప్పారు. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు మార్చి అరెస్టు చేయించడం దారుణమన్నారు. పనులు నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చినా, కూటమి నేతలు వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, హోంమంత్రి అనిత ఫొటో సూట్‌లో ఉండడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని తెలిపారు. అక్రమ అరెస్టులకు భయపడేదిలేని, నాయకులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డా రు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే గణేష్‌ సతీమణి కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కోనేటి రామకృష్ణ, పార్టీ లీగల్‌సెల్‌ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు.

నాయకుల కుటుంబాలకు పరామర్శ

నర్సీపట్నంలో బుధవారం పోలీసులు అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ గురువారం పరామర్శించి, భరోసా ఇచ్చారు. శివపురంలోని ఏకా శివ, బలిఘట్టంలో సుర్ల నాయుడు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్రమ అరెస్టులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, అప్పలనాయుడు, పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, రాష్ట్ర యూత్‌ వింగ్‌ నాయకుడు సీహెచ్‌.వరుణ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement