అల్లూరి పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

అల్లూరి పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తి

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

8లో

అల్లూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అదనపు ఎస్పీ మోహన్‌రావు

అనకాపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై చేసిన పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో గురువారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకంచేసిన తీరు అద్వితీయమన్నారు. 1924 మే 7న ఆయన భౌతికంగా దూరమైనా, భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ జి.ఆర్‌.ఆర్‌. మోహన్‌, సీఐలు టి.లక్ష్మి, ఎస్‌.రమేష్‌, పిల్లా రమేష్‌, బి.రామకృష్ణారావు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి వ్యక్తి కాదు..సమూహ శక్తి

తుమ్మపాల:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదని, సమూహ శక్తి అని ఇన్‌చార్జి డీఆర్వో సుబ్బలక్ష్మి అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ

Advertisement
 
Advertisement
Advertisement