శకం! | - | Sakshi
Sakshi News home page

శకం!

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

ముగిసిన
చారిత్రక నేపథ్యం

జూన్‌ 1 నుంచి వాల్తేరు పేరు అధికారికంగా తొలగింపు

1,106 కి.మీ. మేర

విస్తరించిన వాల్తేరు డివిజన్‌

696 కి.మీ. రాయగడ

డివిజన్‌లో విలీనం

463 కి.మీ.తో

కొత్తగా విశాఖపట్నం

డివిజన్‌ ఏర్పాటు

ఖుర్దాలోని 53 కి.మీ. విలీనం

ఉద్యోగుల సర్దుబాటుపై

చర్యలు పూర్తి

1893–1902 వరకు తూర్పు కోస్తా రాష్ట్ర రైల్వే జోన్‌ పరిధి

1902–1925 వరకు మద్రాస్‌ రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే పరిధి

1925–1952 వరకు బెంగాల్‌ –నాగ్‌పూర్‌ రైల్వే పరిధి

1952–1955 వరకు మొదటిసారి రైల్వే పునర్‌వ్యవస్థీకరణ జరిగినప్పుడు తూర్పు రైల్వే పరిధిలోకి వచ్చింది

1955–1966 వరకు ఆగ్నేయ రైల్వే పరిధి

1966–1977 వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి

1977–2003 వరకు మళ్లీ ఆగ్నేయ రైల్వే పరిధి

2003 ఏప్రిల్‌ 1–2026 మే 31 వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధి

2026 జూన్‌ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో విశాఖపట్నం డివిజన్‌గా కొనసాగనుంది.

ఇ క

సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్‌ ఇక చరిత్రలో మిగిలిపోనుంది. జోన్‌ ఏర్పాటుతో డివిజన్‌ విచ్ఛిన్నం అనివార్యంగా మరింది. జూన్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌ కార్య కలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వాల్తేరుని రెండు భాగాలుగా విభజించేశారు. ఖుర్దాలోని పలాస, ఇచ్చాపురం సెక్షన్లతో 53 కి.మీ. ఇందులో కలిపారు. దీంతో 696 కి.మీ. మేజర్‌ భాగాల్ని రాయగడ డివిజన్‌గానూ.. మిగిలిన 463 కి.మీ. ప్రాంతాన్ని విశాఖపట్నం డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నారు.

చరిత్రలో చిరస్థాయి..

మద్రాసు నుంచి కలకత్తాను కలిపే తూర్పు తీర రైల్వే నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు రైలు మార్గం ఏర్పడింది. 1896లో బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. కాలక్రమేణా వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో విశాఖపట్నం పోర్టు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సరకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. భారతీయ రైల్వే వ్యవస్థలో వాల్తేరు డివిజన్‌ ఒక బంగారు బాతులాంటిది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకి ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్‌(కేకే లైన్‌) మార్గం ఈ డివిజన్‌ పరిధిలోనే ఉండేది. 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1,236 చిన్న వంతెనలతో ఈ మార్గం ఒక ఇంజనీరింగ్‌ అద్భుతంగా గుర్తింపు పొందింది.

కొత్త జోన్‌ రాకతో రెండుగా..

కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు డివిజన్‌ ప్రత్యేక ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తుంది. అద్దాల పెట్టెలు కలిగిన విస్టాడోమ్‌ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్‌ ముందు వరుసలో నిలిచింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా, వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక భాగం రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌, మరో భాగం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ కారణంగా వాల్తేరు అనే చారిత్రక పేరు ఇకపై రైల్వే పటంలో కనిపించే అవకాశం లేదు. దశాబ్దాల ప్రాంతీయ గుర్తింపుగా, ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌గా ఉన్న వాల్తేరు కనుమరుగు కానుంది.

ఆదాయం కోల్పోయినట్లే..!

ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్‌ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏటా రూ.11,598 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడీ ఆదాయంలో సింహభాగం రాయగడ డివిజన్‌కే అందనుంది. దేశంలోనే 260 డీజిల్‌ ఇంజన్లు ఉన్న అతిపెద్ద లోకోషెడ్‌, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్‌ లోకోషెడ్‌, విశాలమైన మార్షలింగ్‌ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్‌, సరకు రవాణా వ్యాగన్‌ ట్రాఫిక్‌ కలిగిన డివిజన్‌ వాల్తేరు. దాదాపు శతాబ్ధంన్నర చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌లో సుమారు 19 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి విభజన ప్రక్రియ కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. జూన్‌ 1 నుంచి ప్రస్తుతం వాల్తేరు రైల్వే డివిజనల్‌ కార్యాలయం.. విశాఖపట్నం డివిజన్‌గా మారనుంది.

వాల్తేరు డివిజన్‌

వివరాల్లో కొన్ని

133 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ శకం ఇక ముగిసినట్లే. ఇప్పటి వరకూ చరిత్రలో పలు జోన్ల పరిధిలో ఉన్న వాల్తేరు.. ఇకపై విశాఖపట్నంగా దక్షిణ కోస్తా జోన్‌ పరిధిలో ఉండనుంది. రైలు చక్రాల సవ్వడితో ఉత్తరాంద్ర జీవనాడిలా విరాజిల్లిన వాల్తేరు ప్రస్థానం ఓ ముగిసిన అధ్యాయం. బ్రిటీష్‌ కాలం నాటి పునాదుల నుంచి దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే డివిజన్లలో ఒకటిగా ఎదిగిన వాల్తేరు ప్రస్థానం ఇక చరిత్ర పుటలకే పరిమితం.

వాల్తేరు వార్షిక ఆదాయం

రూ.11,598.07 కోట్లు

సరకు రవాణా

85.1 మిలియన్‌ టన్నులు

ప్రయాణికుల సంఖ్య

3.34 కోట్లు

ప్రధాన ఆదాయ వనరు

ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు

వాల్తేరు డివిజన్‌ మొత్తం విస్తీర్ణం

1,106 కి.మీ.

వాల్తేరు విభజన

విశాఖపట్నం, రాయగడ డివిజన్లు

విశాఖపట్నం డివిజన్‌ విస్తీర్ణం

463 కి.మీ.

రాయగడ డివిజన్‌ విస్తీర్ణం

696 కి.మీ.

Advertisement
 
Advertisement
Advertisement