పారదర్శంగా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శంగా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

రూ. 2వేల కోట్లతో డ్వాక్రా వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం

వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ పి. వెంకటరమణ స్పష్టం

దేవరాపల్లిలో వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న డీపీఎం పి.వెంకటరమణ

దేవరాపల్లి: ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌తో మరింత పారదర్శకంగా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రాజెక్టు (సంస్థల నిర్మాణ) మేనేజర్‌ (డీపీఎం–ఐబీ) పి. వెంకటరమణ తెలిపారు. దేవరాపల్లి వెలుగు కార్యాలయంలో స్థానిక ఏపీఎం ఎస్‌.ప్రభాకర్‌, ఇతర సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మన డబ్బులు–మనలెక్కలు యాప్‌ను రావికమతం, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, మాడుగుల, సబ్బవరం, మునగపాక మండలాల్లోని పది గ్రామైక్య సంఘాల్లో ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ విజయవంతం కావడంతో త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఈ యాప్‌ను అమలు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల కోట్లతో డ్వాక్రా వార్షిక రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ. 1521.50 కోట్లు, సీ్త్రనిధి ద్వారా రూ. 466 కోట్లు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం ద్వారా రూ. 12.50 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ వీవోఏకి స్మార్ట్‌ ఫోన్లు అందించామని ఆయన చెప్పారు. జిల్లా ఏపీఎం (ఐబీ) బి. కళ్యాణి తదితర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement