కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం లెక్కింపు

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

హుండీల ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

డాబాగార్డెన్స్‌(విశాఖ): కనకమహాలక్ష్మి దేవస్థాన హుండీల ఆదాయం లెక్కింపు బుధవా రం నిర్వహించారు. మార్చి 26 నుంచి ఈ నెల 6 వరకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించా రు. రూ.28,25,338 నగదు, 43.100 గ్రాముల బంగారం, 320 గ్రాముల వెండితో పాటు యూఎస్‌ఏ డాలర్లు 8, ఖతార్‌ కరెన్సీ రియాల్స్‌ 5 వచ్చాయి. హుండీ ఆదాయం లెక్కింపులో ఆల య కార్యనిర్వహణాధికారి శోభారాణి, జిల్లా దేవ దాయ ధర్మదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదారు ఎం.శ్రీధర్‌ తదిత రులు పాల్గొన్నారు.

డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి: సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, విజయ వాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లమా కోర్సు లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్‌ సీహెచ్‌.శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్హతతో 3 సంవత్సరాల వ్యవధిగల డిప్లమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెన్నాలజీ, డిప్లమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మాల్‌ టెక్నాలజీ శిక్షణకు ఈనెల 28 వరకూ ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. వివరాలకు 7893586494 అనే సెల్‌ నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement