తక్షణం బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణం బకాయిలు చెల్లించాలి

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

12 వారాల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే నాలుగు రోజుల క్రితం మూడు వారాలకు సంబంధించిన సొమ్మును ప్రభుత్వం మంజూరు చేసింది. అవి ఇంకా వేతనదారుల ఖాతాల్లో పడలేదు. అది కూడా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేసిన పనికి సంబంధించి మూడు వారాల డబ్బులే విడుదల చేశారు. ఏప్రిల్‌ నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. కూలీలను వేధింపులకు గురిచేయడం సరికాదు. సకాలంలో బకాయిలు చెల్లించాలి. లేదంటే ఉద్యమించక తప్పదు. మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్‌ సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వ ఉంది. గతంలో తట్టా, గునపాపం, పార, తాగునీరు, ట్రావిలింగ్‌, సమ్మర్‌ అలవెన్సులు ఇచ్చే వారు. వాటిని పూర్తిగా కట్‌ చేసి, రూ. 7 పెంచినట్లు ప్రకటించడం అన్యాయం. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ఉండి కూలీలు కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం.

–డి.వెంకన్న, ఏపీ వ్యవసాయి కార్మిక సంఘం కార్యదర్శి

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement