రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు ఎంపిక చేసిన జిల్లా జట్టు క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు
అనకాపల్లి : ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నెల్లూరు జిల్లాలో రాష్ట్రస్థాయి 13వ అంతర్ జిల్లాల సీనియర్ పోటీలు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దాడి శ్యాంప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు జై.బాబులు అన్నారు. తుమ్మపాల గ్రామంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా క్రీడాకారుల బాలబాలికల జట్టు ఎంపిక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి 20 మంది బాలురు, 20 మంది బాలికలు పోటీల్లో పాల్గొనడం జరిగిందని, ఆరుగురు బాలురు, ఆరుగురు మహిళలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


