తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిఽధిలో ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం స్పెషల్ రైళ్లు ఆయా తేదీల నుంచి రెగ్యులర్‌గా నడువనున్నట్లు వాల్తేర్ డివవిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్‌మేనేజర్ కే పవన్‌కుమార్ తెలిపారు. విశాఖపట్నం–ఎస్‌ఎంవి బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 10వ తేదీ నుంచి రెగ్యులర్ రైలుగా (18509) నెంబరుతో నడవనుంది. తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08582)స్పెషల్ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి వీక్లీ రెగ్యులర్ రైలుగా (18510) నడుస్తుంది.


