కలెక్టరేట్‌లో ’ఆయుష్‌’ ఉచిత వైద్య శిబిరం. | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ’ఆయుష్‌’ ఉచిత వైద్య శిబిరం.

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

కలెక్టరేట్‌లో ఆయుష్‌’ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్‌ శిరీష

తుమ్మపాల: వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందుల పంపిణీతో పాటు బీపీ చెక్‌అప్‌, మోకాళ్ళ నొప్పులు, ఆయాసం, దగ్గు, నీరసం, ఎసిడిటీ, మధుమేహం, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ వంటి వ్యాధులకు చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసామని పరవాడ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ టి.శిరీష అన్నారు. కలెక్టరేట్‌లో ’ఆయుష్‌’ ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించి పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ అర్జీదారులకు మందులు పంపిణీ చేశారు. పీజీఆర్‌ఎస్‌ నిర్వహించే సమయంలో ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఆయుర్వేదం, హోమియోపతి సేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంలో హరిపాలెం కాంపౌండర్‌ పి.మేరీ స్వర్ణలత, రేగుపాలెం ఎస్‌ఎన్‌ఓ, ఏ. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement