అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న అదనపు ఎస్పీ మోహనరావు
తుమ్మపాల : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ’ప్రజా ఫిర్యాదుల వేదిక’ కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, చీటింగ్, ఆర్థిక మోసాలు. ఇతర గృహ సంబంధిత ఫిర్యాదులపై గరిష్టంగా 7 రోజుల్లోపు ప్రాథమిక విచారణ పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. మొత్తం 53 ఫిర్యాదులను నమోదు చేయడం జరిందన్నారు. ఎస్‌బీ డీఎస్పీ మోహన్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.


