రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

ఇటీవల జగ్గయ్యపేటలో 13వ రాష్ట్ర స్ధాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పవర్‌ లిప్టింగ్‌ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులు

అనకాపల్లి టౌన్‌ : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఇటీవల నిర్వహించిన 13వ రాష్ట్రస్ధాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ మాస్టర్స్‌ సీ్త్ర, పురుషుల పవర్‌ లిప్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతిష్టాత్మకమైన స్ట్రాంగ్‌ మెన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టైటిల్‌ను సి.హెచ్‌. బాలసాయి చరణ్‌(అనకాపల్లి)83 కిలోల విభాగంలో కై సవం చేసుకున్నారు. అనకాపల్లికి చెందిన శ్రవణ్‌ కుమార్‌ 74 కిలోల విభాగంలో రజత పతకం, 83 కిలోల విభాగంలో ఎం. ధనుష్‌, మహిళల 84 కిలోల విభాగంలో కె. ప్రవల్లిక రజత పతకాలు సాధించారు. ఈ విజయంపై పలు క్రీడా సంఘాలు, జిల్లా పవర్‌ లిప్టింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గుడ్రపు నీట, బద్రీనాధ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement