సోషల్‌ మీడియాలో | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదు

అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదు

పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న వైస్సార్‌సీపీ సోషల్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీరామ్‌

అనకాపల్లి టౌన్‌ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ట్విటర్‌ ఖాతాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టిన స్వాతీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సోషల్‌ మీడియా అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీరామ్‌ అన్నారు. స్ధానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై ఉద్దేశపూర్వకంగా అత్యంత అవమానకరంగా ఉండే విధంగా పోస్ట్‌లు తయారు చేసి, ప్రజలను తప్పుదారి పట్టించేలా పోస్టులు పెడుతున్న ఆమైపె తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వంటివి చట్టపరంగా శిక్షార్హమైన నేరాలన్నారు. తక్షణమే ఇటువంటి తప్పుడు పోస్ట్‌ను వెనువెంటనే తొలగించేలా చర్యలు తీసుకొని స్వాతీ రెడ్డిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని శ్రీరామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement