కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడులు

Feb 26 2026 8:26 AM | Updated on Feb 26 2026 8:26 AM

కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడులు

కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడులు

దేవరాపల్లి: అపరాల సాగులో కొత్త రకం విత్తనాలను నాటడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని కె.వి.కె. ప్రధాన శాస్త్రవేత్త ఎస్‌. రాజ్‌కుమార్‌ సూచించారు. మండలంలోని ఎం. అలమండలో జాతీయ ఆహార భద్రతా మిషన్‌ స్కీమ్‌లో భాగంగా పప్పు ధాన్యాలు పంటలపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏవో ఎల్‌.వై. కాంతమ్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పప్పు ధాన్యాలు దిగుబడి, విస్తీర్ణం పెంచుకునే విధానంపై రైతులకు సమగ్రంగా వివరించారు. కొత్త రకం విత్తనాలు వినియోగించి, సకాలంలో కలుపు మందులు వాడటం ద్వారా ఆశాజనకంగా దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందవచ్చునని సూచించారు. 19–19–19 రకం లేదా, 13–0–45 రకం ఎరువును ఎకరానికి కేజీ చొప్పున 25 నుంచి 35 రోజులకు ఒకసారి, 60 రోజులకు మరోసారి వేయడం ద్వారా ఎకరాకు దాదాపుగా అదనంగా క్వింటా దిగుబడి సాధించవచ్చునని అవగాహన కల్పించారు. ప్రస్తుతం సాగులో ఉన్న మినప పంటను తీసేసి మరలా మినుము లేదా మొక్కజొన్న వేసుకోవచ్చునని సూచించారు. ఉద్యానశాఖ అధికారి సత్తిబాబు మాట్లాడుతూ కాయగూరల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సలహాలు, సూచనలు చేశారు. విస్తరణాధికారి కిషోర్‌ మాట్లాడుతూ మినీ కిట్స్‌, కొత్త వంగడాలపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్‌.కిరణ్‌కుమార్‌, రైవాడ ప్రాజెక్టు చైర్మన్‌ పోతల పాత్రునాయుడు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు బాలు పాల్గొన్నారు.

కె.వి.కె ప్రధాన శాస్త్రవేత్త రాజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement