ఉపాధి పథకం పనులకు సకాలంలో చెల్లింపులు
● రాష్ట్ర డైరెక్టర్ ప్రవీణ్ కుమార్
కశింకోటలో సిబ్బందితో చర్చిస్తున్న రాష్ట్ర డైరెక్టర్ ప్రవీణ్ కుమార్
కశింకోట: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సకాలంలో చెల్లింపులు జరపడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధి పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ కుమార్ ఆదేశించారు. కశింకోటలోని మండల ఉపాధి పథకం కంప్యూటర్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి, పథకంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా చెల్లింపులు జరపడంలో జాప్యానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్, సిమెంట్ రోడ్లు, కాలువలు, ఉద్యానవన అభివద్ధి పనులకు ఫిబ్రవరి 10లోగా చెల్లింపులు జరపడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఆర్.పూర్ణిమదేవి, మండల ఏపీవో మళ్ల శ్రీనివాసరావు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కామేష్, టెక్నికల్ అసిస్టెంట్లు నాగమణి, ఆర్.రవి, కంప్యూటర్ అసిస్టెంట్లు నాగేంద్ర, శ్రీను, ఏఈ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


