పార్సిళ్ల డోర్ డెలివరీలో రాష్ట్రంలో మూడోస్థానం
● డీపీటీవో ప్రవీణ
విజయవాడలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకుంటున్న డీపీటీవో ప్రవీణ
అనకాపల్లి: పార్సిళ్ల డోర్ డెలివరీ, క్యాంపెయిన్‌లో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి(డీపీటీవో) వి.ప్రవీణ తెలిపారు. విజయవాడలో ప్రజారవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా బుధవారం ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహంను డీపీటీవో ప్రవీణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) అనకాపల్లి జిల్లా పరిధిలో గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 19వ తేదీ వరకూ లక్ష్యాన్ని మించి 127 శాతం పూర్తి చేయడంతో అవార్డు లభించినట్టు చెప్పారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సహకారంతోనే అవార్డు సాధించినట్టు చెప్పారు. ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు.


