పకడ్బందీగా వందరోజుల ప్రణాళిక
● విద్యా శాఖ రాష్ట్ర పరిశీలకురాలు, జాయింట్ డైరెక్టర్ ఎన్.గీత
కశింకోట డీపీఎన్ జెడ్పీ హైస్కూలు సందర్శించిన విద్యా శాఖ రాష్ట్ర పరిశీలకురాలు, జాయింట్ డైరెక్టర్ గీత
కశింకోట : టెన్త్ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాఽధించడానికి కృషి చేయాలని విద్యా శాఖ రాష్ట్ర పరిశీలకురాలు, జాయింట్ డైరెక్టర్ ఎన్. గీత కోరారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలు, బాలికల హైస్కూళ్లను బుధవారం సందర్శించారు. అక్కడ టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో ఎక్కడైనా అనుమానాలుంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 6వ తరగతి విద్యార్థుల ప్రగతిని కూడా పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచి చూశారు. స్పోర్ట్స్ క్లబ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరీక్షల నియంత్రణాధికారి కె. శ్రీధర్‌రెడ్డి, హెచ్‌ఎంలు ఎస్.జె.వి ప్రసాద్, ఎం.ఎస్.స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


