సీడీపీవోకు మెమో జారీ
● గణతంత్ర వేడుకల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనపై పీడీ ఆగ్రహం
నర్సీపట్నం : గొలుగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీ య పతాకావిష్కరణ కార్య క్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీడీపీవో శ్రీగౌరికి పీడీ మెమో ఇచ్చారు. బ్లాక్ కోఆర్డినేటర్ చేతిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు శీర్షికన సాక్షిలో వచ్చిన కథనంపై పీడీ స్పందించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. సీడీపీవో జిల్లా కేంద్రంలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సంబంధిత సూపర్‌వైజర్లు కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయి జాతీయ జెండాను ఎగురవేసి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని పీడీ సూర్యలక్ష్మి సీరియస్‌గా తీసుకున్నారు. సంఘటనపై సమగ్ర నివేదిక వివరణ ఇవ్వాలని పీడీ మెమో ఇచ్చారు.


