దళితులపై దాడులు దారుణం
● రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
● వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్
● సాల్మన్ హత్యను ఖండిస్తూ నిరసన
తుమ్మపాల(అనకాపల్లి): దళితుడిపై పచ్చమూకలు దాడులకు పాల్పపడి, హత్య చేయడం దారుణమని, రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు సాల్మన్ హత్యను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ దళిత విభాగం అధ్యక్షుడు పి.సురేష్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రింగ్‌రోడ్డు భీమునిగుమ్మం జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమా ల వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నాయకుల దాడులతో 200 దళిత కుటుంబాలు పిన్నెలి గ్రామా న్ని విడిచి వెళ్లిపోయాయని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన సాల్మన్‌పై టీడీపీ నాయకులు, గుండాలు రాడ్డులతో తీవ్రంగా దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు. హత్యకు గురైన సాల్మన్‌పైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం చూస్తే రాష్ట్రంలో బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. సాల్మన్‌రాజు మృతి చెందడంతో మరోదిక్కు లేక టీడీపీ మూకలపై కేసు నమోదు చేసినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎమం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారన్నారు. హత్యకు పాల్పడిన ఎవరినీ వదిలేది లేదని, రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చట్టం ముందు అందరినీ దోషులుగా నిలబెడతామని చెప్పా రు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండా జ్ఞానదీప్ మాట్లాడుతూ సాల్మన్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త కావడంతోనే కూటమి నాయకులు దారుణంగా హత్య చేశారని, ఆ గ్రామంలో 200 కుటంబాలను కూటమి నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారని చెప్పారు. దళిత మహిళ అయిన హోంమంత్రి అనిత కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.కోటి పరిహారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పి.సురేష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఐ.డి.బాబు, జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ దండా సిద్ధార్థ. నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80 వార్డు అధ్యక్షులు కె.ఎం.నాయుడు, 81 వార్డు అధ్యక్షుడు బొడ్డేడ శివ, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దళితులపై దాడులు దారుణం


