వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ చించివేత
పాయకరావుపేట: నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ తరఫున పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శుక్రవారం కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. కంటోన్మెంట్ వీధి వద్ద వైఎస్సార్ సీపీ నాయకులైన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ సీనియర్ నాయకుడు జగతా శ్రీనులతో పాటు మరికొంత మంది పార్టీ అభిమానుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని 16 తేదీన కొంతమంది చించివేసి, దాని పైపులను ధ్వంసం చేసినట్టు వైఎస్సార్ సీపీ అభిమాని ఎం.రమణ పోలీసులకు శనివారం పిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు దగ్గుపల్లి సాయిబాబా, జగతా శ్రీను, పంచాయతీ వార్డు సభ్యులు పిరాధి రాజు, తుమ్మలపల్లి సతీష్, కోనేటి పద్మారావు, పోసిన వీరబాబు తదితరులు రమణతో పాటు ఫిర్యాదు పత్రాన్ని ఏఎస్‌ఐ నాయుడికి అందజేశారు.
పోలీసులకు ఫిర్యాదు


