రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
పాయకరావుపేట: మండలంలోని పెదరాంభద్రపురం, శ్రీరాంపురం గ్రామాల మధ్యలో శుక్రవారం డెక్కన్ కంపెనీ రోడ్డు జంక్షన్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీ కొనడంతో ముగ్గురు గాయపడినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు. తుని రామకృష్ణాపురం కాలనీకి చెందిన నామవరపు లోకేష్, పితాన కార్తీక్ కుమార్‌లు బైక్ పై శ్రీరాంపురం దిశగా అతివేగంగా వెళ్తున్నారు. ఎదురుగా ఎలక్ట్రిక్ స్కూటర్ పై వస్తున్న పాయకరావుపేట రాజుగారిబీడుకి చెందిన వ్యక్తిని బలంగా ఢీ కొట్టారు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 108 లో తుని ప్రభుత్వ ఆస్పత్రికికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


