సీడీసీఎన్‌సీ అభివృద్ధికి కృషి
మహాసభలో రాయబారులు, పాస్టర్లు తదితరులు
నర్సీపట్నం: స్థానిక సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సీబీసీఎన్‌సీ (కెనడియన్ బాప్టిస్ట్ సర్కార్ నార్తరన్ చర్చ్‌స్) 71వ మహాసభలు మూడు రోజులు ఘనంగా జరిగాయి. ఈ సభల్లో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉమ్మడి ఏడు జిల్లాల సీబీసీఎన్‌సీ సంఘాల రాయబారులు, పాస్టర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సంఘాల అభివృద్ధి, క్రైస్తవుల రక్షణతో సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీబీసీఎన్‌సీ కార్యదర్శి ఎ.డి.కె.జాన్, ప్రెసిడెంట్ రెవ. టి.ఐజాక్, కొత్తపల్లి అబ్రహం, చైర్మన్, బోర్డు ఆఫ్ క్రిస్టియన్ ట్రైనింగ్ వారి దైవ సందేశం నిర్వహించారు. ఈ సభకు వైస్ ప్రెసిడెంట్ కె.సుభద్ర, రికార్డింగ్ సెక్రటరీ ఎన్.ఆర్.నవీన్ కుమార్, ట్రస్ట్ చైర్మన్ వై.కృష్ణమూర్తి, గోదావరి అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.జి.ప్రవీణ్, స్థానిక చర్చి ప్రెసిడెంట్ ఎన్.ఆర్.నవీన్‌కుమార్, సెక్రటరీ పి.దేవానంద్, ట్రైజరర్ సాల్మన్, వైస్ ప్రెసిడెంట్ ఎన్.వయోలా లిలియన్ తదితరులు పాల్గొన్నారు.


