సింగర్ మనో సందడి
గాయకుడు మనోతో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు
కోటవురట్ల: మండలంలోని పాములవాకలో గాయకుడు మనో(నాగూర్‌బాబు) సందడి చేశారు. నర్సీపట్నంలో గురువారం రాత్రి జరిగిన సంక్రాంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఉదయం తన భార్య జమీలాబాబుతో కలిసి పాములవాక విచ్చేశారు. ఐపీఎస్ అధికారి ఇంట్లో ఇరు కుటుంబాల వారు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. స్థానికులు అక్కడకు చేరుకుని సింగర్ మనోతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకుని గ్రామంలో ప్రత్యేకతను వివరించారు.


