గంజాయి కేసులో నిందితుడు అరెస్టు
మాట్లాడుతున్న ఎస్‌ఐ తారకేశ్వర్రావు
నాతవరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తారకేశ్వర్రావు తెలిపారు. 2022లో ఇక్కడ దొరికిన గంజాయి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన రోషిత్‌కుమార్(39) అప్పటి నుంచి పరారీలో ఉన్నాడన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం రావడంతో అతడిని నాతవరం పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు.


