అయ్యప్పస్వామి సన్నిధిలో మకరజ్యోతి ప్రదర్శన
గవరపాలెం గౌరీపంచాయత ఆలయంలో అయ్యప్పస్వామి పడిపూజ ప్రారంభిస్తున్న వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ
అనకాపల్లి: స్థానిక గవరపాలెం గౌరీ పంచాయత దేవాలయంలోని అయ్యప్పస్వామి సన్నిధిలో మకరజ్యోతి దర్శన వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. స్వామివారిని ప్రత్యేక అలంకరణలో గవరపాలెం వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొందూరు సూర్యనారాయణ శాస్త్రి వేదమంత్రాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్‌కు 18 రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాని గురుస్వామి మద్దాల నారాయణరావు ఆధ్వర్యంలో మకర జ్యోతి ప్రజ్వలన, పడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీగౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు మళ్ల సాంబశివరావు, అనకాపల్లి వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ(పెదబాబు), గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసినాయుడు, కార్యదర్శి బొడ్డేడ రామ సత్యనారాయణ, కోశాధికారి శరగడం జగదీష్, అయ్యప్ప స్వామి దేవాలయ కన్వీనర్ మళ్ల సూర్యప్రకాష్‌రావు, ఆళ్ల మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి సన్నిధిలో మకరజ్యోతి ప్రదర్శన


