అత్తారింటికి వెళుతూ..అనంతలోకాలకు..
మాకవరపాలెం : అత్తారింటికి బైక్‌పై వస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. నాతవరం మండలం వై.బి.అగ్రహారం గ్రామానికి చెందిన కీర్తి రాంబాబు(32) తామరం గ్రామానికి చెందిన యువతిని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సంక్రాంతి పండగకు బైక్‌పై తామరం బయలుదేరాడు. మండలంలోని పెద్దమిల్లు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆటో ఢీకొనడంతో హెల్మెట్ లేక తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే రాంబాబును నర్సీపట్నం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో పండగ రోజున రెండు గ్రామాల్లోని కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకుంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.


