రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
రావికమతం: దొండపూడి పెద్ద చెరువు వద్ద బీఎన్ రోడ్డు మార్గంలో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం మండలం జెడ్.బెన్నంవరం పంచాయతీ కిత్తంపేట గ్రామానికి చెందిన పతివాడ రవికుమార్ బైక్‌పై కొత్తకోట కిరాణా సామాన్ల కోసం వెళ్తున్నాడు. రావికమతం మండలం పొన్నవోలు పంచాయతీ దిబ్బలపాలేనికి చెందిన ఉరుకూటి భీమేశ్వరరావు రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో ఉన్న తన గొర్రెల మంద దగ్గర నుంచి స్వగ్రామైన దిబ్బలపాలెం వెళ్తున్నాడు. ఇద్దరూ దొండపూడి పెద్దచెరువు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. కొత్తకోట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చిక్సిత చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు అందలేదని కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
గాయపడిన భీమేశ్వరరావు, రవికుమార్
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు


