రోడ్డంతా బుగ్గే...
మా ఊళ్లో ఉన్న వారు చాలా మంది బయట బాగా ఉద్యోగాలు , వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారు పండగకి కార్లలో ఇక్కడకు వచ్చేటప్పుడు మన ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. మార్టూరు నుంచి తుమ్మపాల వరకూ నాలుగు కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద గోతులతో..మైనింగ్ లారీలు తిరుగుతూ క్రషర్ బుగ్గితో అద్వానంగా ఉంది. కాలేజీకి వెళ్లే పిల్లలు వర్షం పడితే గుంతల్లో పడి రోడ్డు ప్రమాదాలు కూడా అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు..
ఎప్పుడు రోడ్డు ఏస్తారో తెలియడం లేదు.. – బద్దె రవి, గ్రామస్తుడు


