మరణంలోనూ సార్థకత
● వైద్య పరిశోధనలకు సుశీలమ్మ దేహదానం ● ఆమె భర్త కూడా అవయవ దాతే..
అనకాపల్లి : స్థానిక మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ఉషాప్రేమ్ ఆస్పత్రిలో పట్టణానికి చెందిన వాసిరెడ్డి సుశీలమ్మ (91)బుధవారం అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందారు. జిల్లా ఖజానాశాఖ అధికారి వి.ఎల్.సుభాషిణి అత్త అయిన వాసురెడ్డి సుశీలమ్మ నేత్రాలను విశాఖ ఐ ఆస్పత్రికి, శరీరాన్ని విశాఖ ఆంధ్రామెడికల్ కళాశాలకు అప్పగించారు. నేత్రదానం, శరీరదానాన్ని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నంబారు నరేష్, అడ్డూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్థివదేహాన్ని ఆంధ్రమెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఖజానాశాఖ అధికారి వి.ఎల్.సుభాషిణి మాట్లాడుతూ గతంలో సుశీలమ్మ భర్త వాసిరెడ్డి నారాయణరావు మృతి చెందినప్పుడు సావిత్రిబాబు పూలే ట్రస్ట్ ద్వారా పార్ధివదేహాన్ని ఆంధ్రమెడికల్ కళాశాలకు అప్పగించడంతో, ఆయన ఆవయవాలను కొంతమందికి అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం ప్రతినిధులు గ్రంధి గాంధీ, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం పాల్గొన్నారు.


