రేపు జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీలు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రసాద్
మునగపాక: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ కోరారు. బుధవారం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీరామ అభయాంజనేయస్వామి తీర్థంలో భాగంగా నిర్వహించే పోటీలను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మునగపాక నుంచి వాడ్రాపల్లికి వెళ్లే దారిలో పొలాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పెంటకోట విజయ్, వేగి రామకృష్ణ, ఆడారి రాజు, విల్లూరి శకరమనాయుడు, మణికంఠ, ఆడారి గోవింద, భీశెట్టి ఈశ్వరరావు, దాడి మురళి, శరగడం జగన్ పాల్గొన్నారు.


