ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
● జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు
దేవరాపల్లి : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు నింపి, సిరి సంపదలతో తులతూగాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. మండలంలోని తారువ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.


