వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ ధ్వంసం
చమ్మచింతలో ధ్వంసం చేసిన ఫ్లెక్సీ
నాతవరం : మండలంలో చమ్మచింత గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ యూత్ మండల జాయింట్ కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో జననేత జన్మదినం నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండగ సందర్భంగా మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పోటీలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసిన కొందరి ఫొటోలను కట్ చేయడంతో వైఎస్సార్‌సీపీ మండల యూత్ జాయింట్ కార్యదర్శి సందీప్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటనపై మండల పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.


