భవన నిర్మాణ కార్మికుల నిరసన
నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రామకృష్ణ
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవన కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమ బోర్డుకు సంబంధించి రూ.20 కోట్లు ప్రచారానికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మిక సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్, ప్రమాద బీమా, మట్టి ఖర్చులు, మెటర్నటీ బీమా, కార్మికులకు పనిముట్లు అందించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకులు డి.శివ తదితరులు పాల్గొన్నారు.


