400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది
నర్సీపట్నం: సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి గురంధరపాలెం శివారు గదబపాలెం గ్రామ జీడి, మామిడి తోటల్లో సారా బట్టీపై ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా తయారీకి వినియోగించే వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. పండగ ముసుగులో సారా తయారీ చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.


