అనకాపల్లి జేసీగా సూర్యతేజ
మహారాణిపేట(విశాఖ): ఐఏఎస్ అధికారుల బదిలీలు, నూతన పోస్టింగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సూర్యతేజను అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 2024 జూన్ 30న జేసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, సుమారు 23 నెలల 10 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు. 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విద్యాధరిని విశాఖ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టరు కల్పనా కుమారి.. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె 2024 జూలై 24న జీసీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్థానంలో ప్రస్తుతం ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శోభికను జీసీసీ కొత్త ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాధరి
సూర్యతేజ
శోభిక
అనకాపల్లి జేసీగా సూర్యతేజ
అనకాపల్లి జేసీగా సూర్యతేజ


