ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో అర్జీదారుల సమస్యలను వింటున్న అదనపు ఎస్పీ దేవప్రసాద్
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 31 అర్జీలు వచ్చాయి. ఇక్కడ అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–16, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–11 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఏడు రోజుల్లో అర్జీలు పరిష్కరించాలని కింద స్థాయి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


