200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
బెల్లం ఊట ధ్వంసం చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎకై ్సజ్ శాఖ అధికారులు
దేవరాపల్లి: మండలంలోని శంభువానిపాలెంలో సారా బట్టీలపై ఎకై ్సజ్ సీఐ కె.వి. పాపునాయుడు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సోమవారం మెరుపు దాడులు నిర్వహించింది. ఇక్కడ గ్రామ సరిహద్దులో భారీ మొత్తంలో సారా తయారీ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా సారా బట్టీతోపాటు సారా తయారీకి సిద్ధం చేసిన 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు. సారా తయారుదారులపైన బెల్లం సరఫరా చేసిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో అనకాపల్లి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జె. శ్రీనివాస్, చోడవరం ఎకై ్స జ్ ఎస్‌ఐ శేఖరం తదితర సిబ్బంది పాల్గొన్నారు.


