ఉత్సాహంగా సంప్రదాయ ఆటల పోటీలు
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అంతకుముందు తాడాట, తొక్కుడుబిళ్ల, కర్రసాము, ఏడు పెంకులాట, తాడు లాగుడు, గాలిపటాలు పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి పూజారి శైలజ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సంప్రదాయ ఆటల పోటీలు


