రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు, గాయపడిన లోవరాజు
పాయకరావుపేట: మండలంలోని సీతారాంపురం జంక్షన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నాతవరం మండలం చినగొలుగొండపేటకు చెందిన బి.లోవరాజు తన 200 గొర్రెలతో రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొని వెళ్లిపోయింది.ఈ ప్రమాదంలో లోవరాజు గాయపడగా, 24 గొర్రెలు మరణించాయి. మరో 9 గొర్రెలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు టోల్ గేట్ ద్వారా సమాచారం సేకరించి వాహనం ఆచూకీ తెలుసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనం అలుమూరుకు చెందిందిగా గుర్తించామన్నారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


