కత్తెర | - | Sakshi
Sakshi News home page

కత్తెర

Jan 12 2026 7:20 AM | Updated on Jan 12 2026 7:20 AM

కత్తె

కత్తెర

సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
సచివాలయాలకు
జీవీఎంసీ బడ్జెట్‌పై సమావేశం నేడు

డాబాగార్డెన్స్‌ (విశాఖ): జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రీ–బడ్జెట్‌పై సోమవారం స్థాయీ సంఘ సమావేశం జరగనుంది. మేయర్‌, స్థాయీ సంఘం చైర్మన్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో సుమారు రూ.3,750 కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్‌పై సభ్యులు చర్చిస్తారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన అనంతరం కౌన్సిల్‌ ఆమోదానికి పంపిస్తారు. సమావేశంలో ప్రధానంగా ప్రారంభ నిల్వలు, వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయం, చేయాల్సిన ఖర్చులు, ముగింపు నిల్వలు, అలాగే ఏయే విభాగానికి ఎంత కేటాయించారు అనే అంశాలపై చర్చించనున్నారు.

అనకాపల్లి: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేలా వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేరవేయడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రజలు పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజల ముంగిటకే వివిధ రకాలైన సేవలను అందించేవారు. నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సచివాలయ వ్యవస్థను దశల వారిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలను చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ/వార్డు సచివాలయాలను తగ్గిస్తూ సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సచివాలయ పేర్లను తొలగించారు. మరికొన్ని ప్రాంతాల్లో పాత పద్ధతిలోనే సచివాలయాల వ్యవస్థను బోర్డులు లేకుండా నిర్వహిస్తున్నారు.

● గత పాలనలో సచివాలయాల్లో 11 మంది ఉద్యోగులను నియమించి ప్రభుత్వ సేవలను గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు అందజేస్తే, నేటి పాలనలో ఒక్కో సచివాలయంలో ఆరుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

● సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కొంత మంది ఏఎన్‌ఎంలకు పదోన్నతి కలిపిస్తూ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు.

● సచివాలయంలో ఇమ్యూనేషన్‌ కార్యదర్శులు జీవీఎంసీలో, పంచాయతీ రాజ్‌ కార్యాలయాల్లో ఇన్‌చార్జ్‌ ఏఈలుగా వెళ్లిపోయారు.

● కొంతమంది వీఆర్వోలను కలెక్టర్‌ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు.మరికొందరు, తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లిపోయారు.

● జీవీఎంసీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులు విజన్‌ –2047 ప్రాజెక్టుకు డిప్యూటేషన్‌పై ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

● విశాఖలో నిర్వహిస్తున్న రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు జిల్లాలో కొంతమంది సచివాలయ ఉద్యోగులను డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.

● సచివాలయాల అడ్మిన్లు(కార్యదర్శులు) కొంతమంది జీవీఎంసీలో ఆర్‌ఐలుగాను, మరి కొంతమంది వివిధ ప్రభుత్వశాఖల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు

● సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్ష కార్యదర్శులను త్రిటైర్‌ సిస్టమ్‌కు బదిలీ చేశారు.

● ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తక్కువ మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి యూఎఫ్‌ఎస్‌(యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే) సర్వే చేస్తున్నారు.

● ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో సామాజిక పింఛన్లు, ఇతర కార్యక్రమాలకు వాడుకోవడంతో చాలా సమయాల్లో సచివాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.

● 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదు. వలంటీర్లను తొలగించి వారి పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. అంతటితో ఆగకుండా 30కి పైగా సర్వేల బాధ్యతలను నెత్తిన పెట్టింది. దీంతో వారు కార్యాలయాల్లో ఉండకుండా నిత్యం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.

సంక్రాంతి వేళ అప్పన్న దర్శన వేళల్లో మార్పులు

అనకాపల్లి జిల్లాలో మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు– 522 అందులో పనిచేయడానికి కావాల్సిన సిబ్బంది – 5,363 కానీ ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు – 3,824

ఉద్యోగులను ఇతర శాఖలకు

డిప్యూటేషన్‌పై బదిలీలు, పదోన్నతులు

గ్రామ, వార్డు సచివాలయాలను

దశల వారీగా తగ్గించేందుకు

చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు

కొన్ని సచివాలయాల బోర్డుల తొలగింపు

ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న

సచివాలయ వ్యవస్థ

కత్తెర1
1/1

కత్తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement