పుణ్యకోటి వాహనంపై తిరువీధి
పుష్పతోటలో గోదాదేవి అమ్మవారికి పూజలు
పుణ్యకోటి వాహనంలో స్వామివారికి
తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు నిత్యార్చనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం కొండదిగువన ఉత్సవ మూర్తులకు నిత్యపూజలు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, పుష్పతోటలో గోదాదేవి అమ్మవారికి విశేషపూజలు, విష్వక్సేనపూజ, పుణ్యా హవచనం సాత్‌మురై వంటి కార్యక్రమాలు జరి గాయి. అనంతరం శ్రీదేవీ,భూదేవీసమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని పుణ్యకోటివాహనంలోను, గో దాదేవిఅమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు వైభవంగా నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 27వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం ప్రసాదనివేదన, తీర్థ్దగోష్టి, ప్రసాద వినియోగం నిర్వహించారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి రాత్రిపూట తిరువీధి సేవలు నిర్వహించారు. అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధం పారాయణం చేశారు.
పుణ్యకోటి వాహనంపై తిరువీధి


