డిప్యూటేషన్‌పై బదిలీలు అన్యాయం
14 సంవత్సరాలు సీఎంగా పాలన చేస్తున్న చంద్రబాబు గ్రామాల్లో గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయలేకపోయారు. వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ సేవలు అందించాలని సచివాలయాలను ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. గ్రామీణ స్థాయి నుంచి సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు అందుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం ఓర్వలేక, గ్రామ/వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుగా మార్పు చేయడం అన్యాయం. సచివాలయాలు పేర్లు మార్పుచేసి, ఉద్యోగులను తగ్గించడం అవివేకం.
– పి.కన్నారావు, ఎంపీటీసీ, తుమ్మపాల గ్రామం, అనకాపల్లి మండలం


