10 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
పట్టుబడిన గంజాయి, నిందితుడితో ఎస్‌ఐ సతీష్
చీడికాడ: మండలంలోని కోణాం చెక్ పోస్టు వద్ద 10 కిలోల గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి బైక్‌పై గంజాయిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కోణాం చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలానికి చెందిన బుదడంగి చంటిబాబు బైక్‌పై పది కిలోల గంజాయి తరలిస్తున్నాడు. పోలీసులు చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
యలమంచిలి రూరల్: వేడి నీళ్లు మరగబెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకున్న ప్రమాదంలో ఈ నెల 3న గాయపడిన యలమంచిలి మండలం లక్కవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు తేలు రమణమ్మ(80) శుక్రవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. గాయపడిన వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైంది. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందడంతో కుమారుడు తేలు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


