కోఢీ..తగ్గేదేలే!
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
సంక్రాంతి కోడి పందాలకు రంగం సిద్ధమైంది. కోడి పందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా నిర్వాహకులు మాత్రం తగ్గేదేలే అంటూ ఎప్పటి మాదిరిగానే సర్వం సిద్ధం చేశారు. బరుల వద్దే మందు, విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు రోజులు పందాలు మంచి ఆదాయ వనరుగా మారనున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో పందాల నిర్వహణకు ఇప్పటికే పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టు సమాచారం.
డిఫెన్స్ కార్యాలయానికి వెయ్యి ఎకరాల సేకరణ
16న బొజ్జన్న కొండ తీర్థం
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న
మాజీ ఎంపీ సత్యవతి
అనకాపల్లి: సంక్రాంతి సందర్భంగా మండలంలో శంకరం పంచాయతీ బొజ్జన్న కొండపై ఈ నెల 16న తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి తెలిపారు. స్థానిక వివేకానందనగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం తీర్థం (బౌద్ధమేళా) కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బొజ్జన్న కొండ వద్ద లేజర్ లైటింగ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి బొజ్జన్న కొండకు వచ్చే పర్యాటకులు ఉండేందుకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించినట్టు తెలిపారు. ప్రతి ఏడాది కనుమ రోజున పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే రోజు బౌద్ధ భిక్షువులు నాగపూర్, మయన్మార్, కంబోడియా నుంచి వచ్చి కొండను సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు బల్లా నాగభూషణం, జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ, అసోసియేషన్ సభ్యులు రొబ్బి మల్లేశ్వరరావు, వెంకట రమణమూర్తి, ఉడా నాగేశ్వరరావు, కాపారపు సత్యనారాయణ, మైలపల్లి నూకరాజు పాల్గొన్నారు.
సాక్షి, అనకాపల్లి: బంధుమిత్రులు, గ్రామస్తులు, పెద్దలు.. పిల్లలు ఎన్నో మధుర స్మతుల.. సంస్కృతీసంప్రదాయాల నడుమ నిర్వహించుకోవాల్సిన సంక్రాంతి సంబరాలు రానురాను జూద శిబిరాలకే పరిమితమవుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు దీటుగా అనకాపల్లి జిల్లాలో కోడి పందేల బరులు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రహస్య స్థావరాల్లో చాపకింద నీరులా పందెం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పోటాపోటీగా బరులు, ఇతర జూద క్రీడల నిర్వహణకు స్థలాలు సిద్ధం చేసుస్తున్నారు. జిల్లాలో గత ఏడాది పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, నర్సీప ట్నంలలో బరులు ఏర్పాటు చేసి, భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పందేలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మరో ఆడుగు ముందుకేసి కోనసీమ తరహాలో బరులతో పాటు టెంట్లు, గ్రిల్స్, మందు, విందు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో బరి ఏర్పాటు చేశారు. ఈఏడాది రాంబిల్లి మండలం వెంకటాపురానికి మార్చారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో గత ఏడాది నిర్వహించగా.. ఈ ఏడాదిలో ఎస్.రాయవరం మండలంలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులేమో ఏటా మాదిరిగానే కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలంటూ ప్రకటనలు జారీ చేశారు. పోలీసులు అక్కడక్కడ చిన్నాచితకా బరులను తొలగించడం.. పండగ దగ్గర పడ్డాక జిల్లాలో జూదక్రీడలే లేవనట్లు చేతులెత్తేయడం పరిపాటిగానే మారింది. మరి ఈ ఏడాది పకడ్బందీగా చర్యలు తీసుకుంటారో..లేదా గత ఏడాది మాదిరే మామ్మూళ్లు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తారో వేచి చూడాల్సిందే.
ఒక్కో బల్లకు రూ.5 లక్షలు
రాంబిల్లి మండలం వేంకటాపురంలో మూడు రోజు ల పాటు నిర్వహించే ఈ జూద క్రీడల్లో 16 లాటరీ బల్లలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వీటిలో అచ్యుతాపురానికి చెందిన జనసేన నేతలకు –4, రాంబిల్లి నేతలకు–3, యలమంచిలి నేతలకు–4, మునగపాక నేతలకు –5 లాటరీ బల్లలు కేటాయించినట్టు సమాచారం ఒక్కో బల్లను ఏర్పాటు చేసినందుకు గానూ రూ.5 లక్షల చొప్పున సుందరపు అనుచరులకు చెల్లించినట్లు తెలిసింది. పందేల నిర్వాహకులకు మద్యం, భోజనాలు అక్కడే ఏర్పా టు చేస్తున్నారు. మద్యం విక్రయించే వారు, కోడి కత్తె కట్టేవారు, కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించేవారు కూడా వారి కొంత ముట్టజెప్పినట్టు సమాచారం.
పోలీసులకు మామ్మూళ్లు ?
ఈ కోడి పందేలు, జూద క్రీడలు ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గంలో ఉన్న పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పోలీసులకు రూ.30 లక్షల వరకూ మామ్మూళ్లు ఇచ్చినట్లు సమాచారం. జూద క్రీడలు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న వెంకటాపురం గ్రామంతో పాటు సమీప గ్రామ ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులను సామాన్య ప్రజలు ఈ జూద క్రీడల్లో పోగొట్టుకుంటారని, పండగ మూడు రోజులు మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరగడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వారు వాపోతున్నారు. పండగ మూడు రోజులు డబ్బులు పెద్దఎత్తున చేతులు మారతాయనేది బహిరంగ రహస్యం.
యమ గిరాకీ...
జిల్లాలో కోడి పుంజులు, కోడి కత్తులు, శిక్షకులకు డిమాండ్ పెరిగింది.గత ఏడాది కంటే ఈ ఏడాది జిల్లాలో పదివేలకు పైగా పందెం పుంజులను పెంచి వాటికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారని అంచనా. వారంరోజులుగా వీటి అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఒక్కోజాతి పుంజును రూ.10 వేల నుంచి నుంచి రూ.20 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఎక్కువగా నెమలి, డేగ, అబ్రాజు, సీతువ, కాకి, పర్లా, రసంగి, కెంకిరాయి తదితర పుంజులకు గిరాకీ ఉంది.
హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా!
యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండ లాలకు గానూ రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామం సమీపంలో 80 ఎకరాల ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లో భారీఎత్తున జూద క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అక్కడ మట్టిని చదును చేసి, కార్ల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నారు. జనసేనకు చెందిన సుందరపు బ్రదర్స్ అనుచరుల కనుసన్నులోనే జరగుతున్నట్లు సమాచారం. కోడి పందేలతో పాటు లాటరీ బల్ల, గుండాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు.
బరి తెగిస్తున్న నిర్వాహకులు
జూద క్రీడలకూ ఏర్పాట్లు
మందు, విందు సైతం సిద్ధం
రాంబిల్లి మండలం వెంకటాపురంలో
భారీగా ఏర్పాటుకు సన్నాహాలు
పోలీసులు వద్దంటున్నా పట్టని వైనం
కోడిపందాలు వద్దు..
కోడిపందేల నిర్వహణ చట్టవిరుద్ధం. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జిల్లాల్లో వీటికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కోడిపందేల నిర్వాహకులు, కత్తులు తయారుచేసే వారిపై, ఆడేవారిపై కూడా బైండోవర్ కేసులు నమోదుచేస్తాం.
– విష్ణు స్వరూప్, పరవాడ డీఎస్పీ
కోఢీ..తగ్గేదేలే!
కోఢీ..తగ్గేదేలే!
కోఢీ..తగ్గేదేలే!
కోఢీ..తగ్గేదేలే!


