ఫ్లెమింగ్ ఫెస్టివల్‌లో కార్టూన్ ప్రదర్శనకు ఆహ్వానం
నాతవరం: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల 10, 11 తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్‌లో చంటిబాబు మాస్టారు వేసిన కార్టూన్‌ను ప్రదర్శించనున్నారు. నాతవరం మండలం చమ్మచింత పాఠశాలలో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్టూనిస్టు అంచటి చంటిబాబు పర్యావరణ సమతుల్యం, వన్యప్రాణుల పరిరక్షణ, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యం, తదితర అంశాలు ప్రతిబింబించేలా కార్టూన్ గీశారు. ఈ ఉత్సవాల్లో కార్టూన్ ప్రదర్శించేందుకు విద్యా శాఖ ద్వారా గురువారం ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో చంటిబాబును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఉత్సవాల్లో ఉత్తమ కార్టూన్‌గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
ఫ్లెమింగ్ ఫెస్టివల్‌లో కార్టూన్ ప్రదర్శనకు ఆహ్వానం


